Nani: నాని 'దసరా' నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ సిద్ధం!

  • నాని  హీరోగా రూపొందిన 'దసరా'
  • బొగ్గుగనుల నేపథ్యంలో నడిచే కథ 
  • నాని జోడీగా రెండోసారి కనిపించనున్న కీర్తి సురేశ్ 
  • మార్చి 30వ తేదీన విడుదల
Dasara movie upadate

చూస్తుండగానే నాని ఖాతాలో రెండు ఫ్లాపులు పడిపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్లో ఆమెకి ఇది రెండో సినిమా.  

ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు 'దసరా' కావడంతో .. 'దసరా' పండుగకి ఏదైనా అప్ డేట్ వదులుతారా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. 

ఈ విషయాన్ని నానితో ఎనౌన్స్ చేయిస్తూ చిన్నపాటి వీడియో ఒకటి వదిలారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. రాజేంద్ర ప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ .. సముద్రఖని .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News