Allu Arjun: 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ చేయనున్న కాజల్!

  • కాజల్ కి తగ్గని అవకాశాలు
  • అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్ .. అదే క్రేజ్ 
  • 'పుష్ప 2' ఐటమ్ కోసం సంప్రదించిన సుకుమార్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్  
Pushpa 2 movie update

టాలీవుడ్ ఇండస్ట్రీని సుదీర్ఘ కాలం పాటు ఏలేసిన అందాల కథానాయికలలో కాజల్ ఒకరు. వ్యక్తిగత కారణాల వలన కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, మళ్లీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఆమెను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయినట్టుగా తెలుస్తోంది.

'పుష్ప' సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందించాడు. ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ముఖ్యంగా సమంత చేసిన ఐటమ్ సాంగ్ జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఈ సారి అంతకుమించి అన్నట్టుగా 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ ను దేవిశ్రీ ట్యూన్ చేశాడట. ఆ పాట కోసమే ఇప్పుడు కాజల్ ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

ఇంతకుముందు 'జనతా గ్యారేజ్' సినిమాకి కాజల్ చేసిన ఐటమ్ 'నేను పక్కా లోకల్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఒక్క పాటకి ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప 2'లో సందడి చేయనుందని అంటున్నారు. అదే నిజమైతే ఇప్పుడు ఆమె కోటికి పైనే పారితోషికం తీసుకునే అవకాశం లేకపోలేదు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News