బటన్ నొక్కేందుకు మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా?: జగన్ పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు
- నేడు కుప్పంలో పర్యటిస్తున్న జగన్
- కుప్పం రోడ్లు మొత్తం బ్యారికేడ్లు పెట్టిన వైనం
- రోడ్లు వేయడం రాదుకానీ.. రోడ్లను తవ్వేసి బ్యారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని నాదెండ్ల సెటైర్
ఈ నేపథ్యంలో వైసీపీ నేత నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా? అని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ? అని ప్రశ్నించారు. మీకు రోడ్లు వేయడం రాదుకానీ... రోడ్లు తవ్వేసి బ్యారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.