YSRCP: వచ్చే ఏడాది నుంచే విశాఖ రాజ‌ధానిగా ఏపీ పాల‌న‌: మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌

ap minister gudivada amarnath comments on 3 capitals issue
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజ‌ధాని, రాష్ట్ర పాల‌న గురించి రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం నాటి అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి అమ‌రావ‌తితో పాటు విశాఖ‌, క‌ర్నూలుల‌ను రాజ‌ధానులుగా మారుస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో తాము వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది నుంచి ఏపీ పాల‌న విశాఖ నుంచే సాగుతుంద‌ని కూడా గుడివాడ చెప్పారు. 

ఇక అమ‌రావ‌తి టూ అర‌స‌విల్లి అంటూ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పైనా మంత్రి అమ‌ర్‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ ప‌రిధిలో రైతుల పాద‌యాత్ర‌లో ఏం జ‌రిగినా దానికి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడే బాధ్యుడ‌ని ఆయ‌న ఆరోపించారు. విశాఖ‌లో రాజ‌ధాని కోసం సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేద‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh
Vizag
Gudivada Amarnath

More Telugu News