కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్
- బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి
- కుటుంబ సభ్యులు, ప్రభాస్ ను పరామర్శించి ఓదార్చిన రాజ్ నాథ్
- సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పిన బీజేపీ నేతలు
ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి..
కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బీజేపీ నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.