ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల నిలిపివేత‌
Add ap7am to your home Screen

ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల నిలిపివేత‌

ap high court issues stay order on gorantla madhav video case
  • గోరంట్ల‌ మాధ‌వ్ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు న‌మోదు
  • ఈ కేసులో నిందితులుగా ప‌లువురు టీడీపీ నేత‌ల పేర్లు
  • త‌న పేరును చేర్చ‌డాన్ని స‌వాల్ చేసిన చింత‌కాయ‌ల విజ‌య్‌
  • విజ‌య్ క్వాష్ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు
  • త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తూ స్టే ఆర్డర్ జారీ  
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా చెబుతున్న వీడియో వ్య‌వ‌హారంపై త‌దుప‌రి చ‌ర్య‌లను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇక‌పై త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆర్డ‌ర్ జారీ చేసింది. త‌న‌దిగా చెబుతూ ఓ మార్ఫింగ్ వీడియోతో త‌న ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నారంటూ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌లువురు టీడీపీ నేత‌ల పేర్ల‌ను సీఐడీ అధికారులు చేర్చారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ యువ నేత‌, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో త‌న‌ను నిందితుడిగా చేర్చిన వైనాన్ని విజ‌య్ హైకోర్టులో స‌వాల్ చేశారు. విజ‌య్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేయాలంటూ సీఐడీ అధికారుల‌ను ఆదేశిస్తూ స్టే ఆర్డ‌ర్‌ను జారీ చేసింది.
AP High Court
YSRCP
TDP
Vijay chintakayala
AP CID
Gorantla Madhav

More Telugu News