అమ‌రావ‌తి అసైన్డ్ భూముల కుంభ‌కోణంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ

ap cid arrests 5 accused amaravati assigned lands sale
  • అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల విక్ర‌యాల‌పై సీఐడీ కేసు న‌మోదు
  • 1,100 ఎక‌రాల్లో 169.27ఎక‌రాల విక్ర‌యాల‌కు నిందితులు స‌హ‌క‌రించార‌న్న సీఐడీ
  • నిందితుల‌కు రామ‌కృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అందాయ‌ని వెల్ల‌డి
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని అసైన్డ్ భూముల‌కు సంబంధించిన కుంభ‌కోణంపై ద‌ర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మంగ‌ళ‌వారం ఓ కీల‌క అడుగు వేశారు. ఈ కుంభ‌కోణంతో సంబంధం ఉందంటూ తాజాగా ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌, చిక్కాల విజ‌య‌సార‌థి, బ‌డే ఆంజ‌నేయులు, కొట్టి దొర‌బాబు ఉన్నారు. 

ఈ కుంభ‌కోణంలో 1,100 ఎక‌రాల అసైన్డ్ భూములు చేతులు మారిన‌ట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో 169.27 ఎక‌రాల విక్ర‌యాల‌కు సంబంధించి ఈ ఐదుగురు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు సీఐడీ తెలిపింది. మాజీ మంత్రి నారాయ‌ణ‌తో పాటు ఆయ‌న స‌మీప బంధువుల ఆధ్వ‌ర్యంలో ఈ భూముల విక్ర‌యాలు జ‌రిగాయ‌ని, ఈ విక్ర‌యాల్లో ఈ ఐదుగురు నిందితులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించింది. ఇందుకు గాను వీరికి రామ‌కృష్ణ హౌసింగ్ డైరెక్ట‌ర్ ఖాతాల నుంచి రూ.15 కోట్లు అందిన‌ట్లు ఆధారాలు ల‌భించాయ‌ని సీఐడీ తెలిపింది.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
AP CID
Assigned Lands

More Telugu News