ప్రియుడితో తిరగవద్దన్నందుకు సొంత తమ్ముడిని చంపేసింది!
- ఝార్ఖండ్ లోని రామ్ గఢ్ జిల్లాలో దారుణం
- వేరే కులం వ్యక్తితో సంబంధం ఏమిటని తప్పుపట్టిన తమ్ముడు
- కక్షగట్టి తన నివాసంలోనే హత్య చేసిన 25 ఏళ్ల యువతి
- యువతిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
క్వార్టర్స్ లోనే మృతదేహాన్ని గుర్తించి..
థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతి పేరు చంచల కుమారి అని, ఆమె తమ్ముడు రోహిత్ కుమార్ అని స్థానిక పోలీసులు వెల్లడించారు. తన కుమారుడు కనిపించడం లేదని వారి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో చంచల కుమారి క్వార్టర్స్ లో రోహిత్ మృతదేహం లభించింది. దీనిపై నిలదీయగా తాను, తన ప్రియుడు కలిసి హత్య చేసినట్టుగా చంచల కుమారి అంగీకరించిందని పట్రటు ఏరియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ చౌదరి వెల్లడించారు. చంచల కుమారి, సోను అన్సారీని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.