MS Dhoni: యూఎస్ ఓపెన్‌లో ధోనీ, క‌పిల్‌... వీడియో ఇదిగో

ms dhoni and kapil dev spotted in us opn match stands
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్నారు. హోరాహోరీగా సాగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్న‌మెంట్ మ్యాచ్‌ల‌ను వీక్షిస్తున్న వారిద్ద‌రి వీడియో ఒక‌టి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. యూఎస్ ఓపెన్ టోర్న‌మెంట్‌లో ఓ మ్యాచ్‌కు హాజ‌రైన ధోనీ.. మ్యాచ్‌ను త‌దేకంగా వీక్షిస్తుండ‌గా... ఆయ‌న‌తో ఓ వ్య‌క్తి మాట్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో కెమెరాను చూసిన ధోనీ ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశాడు. ఆ త‌ర్వాత కెమెరా అదే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క‌పిల్ దేవ్ వంక తిర‌గ‌గా...ఆయ‌న కూడా ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశాడు.

ధోనీ, క‌పిల్ ఇద్ద‌రూ భారత మాజీ క్రికెట‌ర్లే కాకుండా... ఇద్ద‌రూ భార‌త జ‌ట్టుకు కెప్టెన్లుగా ప‌నిచేసిన వారే. అంతేకాకుండా భార‌త జ‌ట్టు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను రెండింటిని గెలిస్తే... వాటిలో తొలి క‌ప్‌ను క‌పిల్ దేవ్ గెల‌వ‌గా, రెండో క‌ప్‌ను ధోనీ గెలిచాడు. ఇక క‌పిల్ కంటే కాస్తంత మెరుగ్గా రాణించిన ధోనీ... వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌తో పాటుగా చాంపియ‌న్స్ ట్రోఫీతో పాటు టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను కూడా గెలిచాడు. యూఎస్ మ్యాచ్ కు ముందు వీరిద్దరూ కలిసి ఓ హోటల్ లో మరింత మందితో కలిసి దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Go Back to Shorts
MS Dhoni
Kapil Dev
Team India
Cricket
Tennis
US Open
Viral Videos

More Telugu News