ఈటల రాజేందర్ తో భేటీ అయిన సినీ నటి దివ్యవాణి
- ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి
- శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన నటి
- బీజేపీలో చేరాలని ఈటల ఆహ్వానించినట్టు సమాచారం
ఈ క్రమంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో సినీనటి దివ్యవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. వీరి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దివ్యవాణిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆమె కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.