భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో
- కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్
- సేవా దళ్ శ్రేణుల వెనుకే తొలి అడుగు వేసిన నేత
- కశ్మీర్ వరకు సాగనున్న పాదయాత్ర
దాదాపుగా 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ యాత్ర చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది.