ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య
- సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య
- మృతుడు రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తింపు
- ఆగస్ట్ 31న ఆత్మహత్యకు పాల్పడిన మరో విద్యార్థి
వారం వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో సారి. ఆగస్ట్ 31న ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఐఐటీలో 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. మరోవైపు, ఐఐటీ క్యాంపస్ లో వరుస ఆత్మహత్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.