Sharwanand: త్రివిక్రమ్ చేతుల మీదుగా శర్వానంద్ కొత్త చిత్రం ప్రారంభం!

  • పీపుల్ మీడీయా నుంచి కొత్త ప్రాజెక్టు
  • కొంతసేపటి క్రితం లాంఛనంగా మొదలైన షూటింగ్ 
  • శర్వానంద్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
Sharwanand letest movie update

శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ హీరోగా మరో సినిమా పట్టా లెక్కింది. శర్వానంద్ - రాశి ఖన్నా జోడీగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.

'కార్తికేయ 2' సినిమాతో భారీ లాభాలను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా వారు, తమ తాజా ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరోహీరోయిన్లపై త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది.

 కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన దర్శకత్వంలో 'రౌడీ ఫెలో' ... 'ఛల్ మోహన్ రంగా' సినిమాలు వచ్చాయి. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను అందించనున్నారు.

More Telugu News