కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం.. హాజరు కానున్న అమిత్ షా
- పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న కార్యక్రమం
- అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సీఎంల హాజరు
- అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
ఈ ఏడాది తెలంగాణ విమోచన దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మైలు హాజరు కానున్నారు.