ఏపీ ఎస్ఎల్‌బీసీ చైర్మన్‌గా నవనీత్ కుమార్... జగన్‌తో భేటీ అయిన యూబీఐ జీఎం
- యూబీఐలో జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న నవనీత్ కుమార్
- ఏపీ ఎస్ఎల్‌బీసీ చైర్మన్‌గా ఇటీవలే నియామకం
- సీఎం జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన వైనం
రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక తయారీ, వ్యవసాయం సహా ఇతర రంగాలకు రుణాల విడుదలకు సంబంధించి ఎస్ఎల్‌బీసీ కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్ఎల్‌బీసీకి నూతన చైర్మన్‌గా నియమితులైన నవనీత్ కుమార్ సీఎం జగన్‌తో నేడు భేటీ అయ్యారు.