మళ్లీ దొరికిన పులస.. ఈసారి మరింత ఎక్కువ ధర!
- గోదావరిలో కొనసాగుతున్న పులస చేపల ప్రవాహం
- గతవారం 2 కిలోల చేపకు రూ. 20 వేల ధర
- నిన్న మరో చేపకు రూ. 23 వేల ధర పలికిన వైనం
ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను నిన్న సాయంత్రం స్థానిక రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ. 22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ. 23 వేలకు కొనుగోలు చేశారు.