YSRCP: ఉపరాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి... ఫొటో ఇదిగో
ఎస్.నిరంజన్ రెడ్డి.. తెలంగాణకు చెందిన యువ న్యాయవాది ఆయన. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన కేసుల్లో జగన్ తరఫున వాదనలు వినిపించే లాయర్. ఆయన ఇటీవలే ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇక ఇటీవలే భారత ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌కడ్‌ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ నిరంజన్ రెడ్డి నేడు జగదీప్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఉపరాష్ట్రపతి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.