Vikram: చాటుగా మాటేసి కాటేసే 'కోబ్రా' .. తెలుగు ట్రైలర్ రిలీజ్!

  • 'కోబ్రా'గా కనిపించనున్న విక్రమ్
  • కథానాయికగా ఆకట్టుకోనున్న శ్రీనిధి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ 
  • ఈ నెల 31వ తేదీన సినిమా విడుదల
Cobra movie telugu trailer released

విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు 'కోబ్రా' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రీనిధి శెట్టి అలరించనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, ఈ రోజున తెలుగు వెర్షన్ ట్రైలర్ ను వదిలింది.

'కోబ్రా'కి రకరకాలుగా రూపాలు మార్చడం తెలుసు .. చాటుగా మాటేసి కాటేయడం తెలుసు' అనే వాయిస్ ఓవర్ పై ఈ ట్రైలర్ నడుస్తుంది. బయటికి ఓ సాధారణ మ్యాథ్స్ టీచర్ గా కనిపిస్తూ, 'కోబ్రా' తన పనులను చక్కబెడుతూ ఉంటాడనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

 డిఫరెంట్ గెటప్స్ తో విక్రమ్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఆయనను పట్టుకునే ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. ఏఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి

More Telugu News