Sky Surfing: ఆకాశంలో తలకిందులుగా గిరగిరా తిరుగుతూ.. హెలికాప్టర్​ నుంచి దూకి ఓ యువకుడి సాహసం.. వీడియో ఇదిగో

Man sky surfed 175 helicopter spins in single jump
షార్ట్స్‌లో చూడండి
మామూలుగా గుండ్రంగా తిరిగితే పది పన్నెండు చుట్లు తిరగగానే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలతిరిగిపోతున్నట్టు అయి కింద పడిపోతుంటాం. అదే ఒకేసారి 175 చుట్లు తిరిగితే అమ్మో గ్రేటే అంటారు. మరి ఆ చుట్లు కూడా తలకిందులుగా గాల్లో వేలాడుతూ తిరిగితే.. వామ్మో అనిపిస్తుంది. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఇలా తలకిందులుగా గాల్లో చుట్లు తిరిగి.. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికి సంబంధించి గిన్నిస్ బుక్ తాజాగా వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పెట్టింది.

స్కై సర్ఫింగ్ చేస్తూ..
  • అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడమన్నమాట.
  • ఈ క్రమంలోనే తాజాగా తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని.. తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ (సర్ఫింగ్ బోట్ హెలికాప్టర్ పైన బ్లేడ్లలా తిరుగుతూ, కింద తాను గుండ్రంగా తిరుగుతుండటం) చేశాడు.
  • గత నెలలో వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. 
  • ఇతను 2021లో కూడా ఈజిప్ట్‌లోని గిజాలో పిరమిడ్ల సమీపంలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే అప్పట్లో 165 చుట్లు తిరగగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు.
  • గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ఫీట్ ను హెలికాప్టర్ లోంచి పరిశీలించడంతోపాటు వీడియోను చిత్రీకరించారు. దీనిని ఇటీవలే తమ యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు.
 
Go Back to Shorts
Sky Surfing
Helicopter Spins
Spin
Offbeat
Sports
USA

More Telugu News