కుప్పంలో చంద్రబాబు పర్యటన.. బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ.. అన్నా క్యాంటీన్ ధ్వంసం.. ఉద్రిక్తత!
- బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ధ్వంసం
- పోటాపోటీగా నిరసనలకు సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ
- కుప్పంకు చేరుకోవాలంటూ వాట్సాప్ ద్వారా సందేశాలు
మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.