వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగిన బండి సంజయ్... ఫొటోను పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ
- అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్
- వైరి వర్గాల విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ తెలంగాణ చీఫ్
- పాదయాత్రలో ఇటీవలే వృద్ధురాలికి చెప్పులు తొడిగిన సంజయ్
- ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ
ఇదిలావుంచితే, ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణలో యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవలే ఓ వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చింది. 'పెద్దలను గౌరవించండి. వారి దీవెనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని వ్యతిరేకత నుంచి కాపాడతాయి' అంటూ ఓ కామెంట్‌ను జత చేసింది.