ఢిల్లీ బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌... రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తిని క‌లిసే అవ‌కాశం

ys jagan leaves for delhi from gannavaram
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ రాత్రి ఢిల్లీలోనే బ‌స చేస్తారు. సోమ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అవుతారు. 

ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ ల‌తోనూ జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Delhi Tour
Prime Minister
Narendra Modi
President Of India
Vice President

More Telugu News