జగన్ ను కలిసి థ్యాంక్స్ చెప్పిన నాయీ బ్రాహ్మణులు
- నాయీబ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం
- నిషేధిత పదాలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు
- తమ ఆత్మగౌరవాన్ని కాపాడారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయీబ్రాహ్మణులు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్న పదాలను ఉపయోగిస్తే... నాయీ బ్రాహ్మణులను అవమానపరిచినట్టుగా, వారి మనోభావాలను దెబ్బతీసినట్టుగా భావిస్తారు. ఎవరైనా ఈ పదాలు వాడితే వారిపై భారత శిక్షాస్మృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.