జ్యోతి ప్రజ్వలనకు ముందు సంప్రదాయాన్ని పాటించిన తమన్నా భాటియా
- ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ వేడుక
- జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచిన తమన్నా
- దీపం వెలిగించే ముందు పాదరక్షలు తీసేసిన నటి
కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కొవ్వొత్తితో దీపపు కుందీలోని వొత్తులను వెలిగించాలి. తాప్సీ పన్ను ముందుగా జ్యోతి వెలిగించించింది. వీడియోను గమనిస్తే కాలికి పాదరక్షలతోనే ఆమె ఆ పనిచేసింది. ఆ తర్వాత తన వంతు రాగానే, తమన్నా కాలికి పాదరక్షలు విడిచేసి ముందుకు వచ్చింది. కొవ్వొత్తితో దీపం వెలిగించింది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా యూజర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న పనులే గొప్పగా ప్రభావితం చేస్తాయని, భారత్ దేశ గొప్ప సంస్కృతీ వారసత్వాన్ని ఆమె తెలియజేస్తోందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. (వీడియో కోసం)