Thummala: ఖమ్మం జిల్లాలో తుమ్మల అనుచరుడు దారుణ హత్య

Thummala follower Krishnaiah murdered
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్ పై వెళ్తుండగా ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆయన బైక్ ను ఆటోతో ఢీకొట్టించిన దుండగులు... వేటకొడవళ్లతో నరికి చంపేశారు. తెల్దారుపల్లి శివార్లలో ఈ దారుణం జరిగింది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రస్తుతం కృష్ణయ్య ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు ఈ హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడి... ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.
Go Back to Shorts
Thummala
Follower
Krishnaiah
Murder

More Telugu News