నిలకడగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం... వెంటిలేటర్ తొలగింపు
- న్యూయార్క్ లో రష్దీపై దాడి
- వేదికపైనే కుప్పకూలిన రచయిత
- హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
- ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్న రష్దీ
సల్మాన్ రష్దీ న్యూయార్క్ లోని చౌటాక్వా స్వచ్ఛంద విద్యాసంస్థలో ఓ సదస్సులో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, హాదీ మతార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం తెలిసిందే. మెడ, ఉదరంలో కత్తిపోట్ల కారణంగా రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఓ కన్ను కోల్పోయే ముప్పు ఎదుర్కొంటున్నారని, కాలేయం బాగా దెబ్బతిన్నదని నిన్న వార్తలు వచ్చాయి.