భారత బాక్సర్లు సంతకాలు చేసిన బాక్సింగ్ గ్లోవ్స్ ను ప్రధాని మోదీకి అందించిన నిఖత్ జరీన్

13-08-2022 Sat 21:35
  • కామ‌న్వెల్త్ గేమ్స్‌లో స‌త్తా చాటిన నిఖ‌త్ జ‌రీన్‌
  • బాక్సింగ్‌లో ప‌సిడి ప‌త‌కాన్ని సాధించిన లేడీ బాక్స‌ర్‌
  • కామ‌న్వెల్త్ గేమ్స్ క్రీడాకారుల‌తో భేటీ అయిన ప్ర‌ధాని మోదీ
  • నిఖ‌త్ జ‌రీన్‌ను ప్ర‌త్యేకంగా స‌న్మానించిన వైనం
Nikhat Zareen gifts boxing gloves to PM Modi
కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త్‌కు ప‌సిడి ప‌త‌కాన్ని సాధించి పెట్టిన తెలంగాణ మ‌హిళా బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన నిఖత్ జరీన్ నుంచి అపురూప కానుక అందుకున్నారు. భారత బాక్సర్లందరూ సంతకాలు చేసిన బాక్సింగ్ గ్లోవ్స్ ను నిఖత్ ప్రధాని మోదీకి అందించింది. శ‌నివారం కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త్ త‌ర‌ఫున పాలుపంచుకున్న క్రీడాకారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయిన మోదీ... వారి ప్ర‌తిభ‌ను కీర్తించారు. 

ఈ ద‌ఫా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆ క్రీడా సంబరాలు ముగియ‌గా... క్రీడాకారులంతా దేశం చేరుకున్నారు. వీరంద‌రినీ ఢిల్లీకి పిలిపించిన మోదీ... వారికి తన ఇంట ఆతిథ్యం అందించారు. దేశ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప‌జేసిన క్రీడాకారుల‌ను ఆయ‌న మెచ్చుకున్నారు.