సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో విస్టా డోమ్ బోగీ ఏర్పాటు... చార్జీ రూ.2,110
- సికింద్రాబాద్- పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణ
- ఈ నెల 10 నుంచి రాకపోకలు
- విస్టా డోమ్ రూపంలో రైలుకు అదనపు హంగు
- విస్టా డోమ్ బోగీకి ప్రయాణికుల ఆదరణ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విస్టా డోమ్ ను కలిగివున్న మొదటి రైలు సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్. ఈ విస్టా డోమ్ బోగీలో ప్రయాణానికి సికింద్రాబాద్ నుంచి పూణేకి ఒక్కొక్కరికి చార్జీ రూ.2,110 గా నిర్ణయించారు. విస్టా డోమ్ బోగీకి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి రాత్రి 11.10 గంటలకు పూణే చేరుకుంటుంది. అటు పూణేలో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది.

