షూటింగ్ లో గాయపడిన సీనియర్ నటి టబు
- అజయ్ దేవగణ్ హీరోగా భోలా
- హైదరాబాదులో షూటింగ్
- టబుపై చేజింగ్ సీన్ల చిత్రీకరణ
- ట్రక్కు అద్దాలు పగిలి టబు నుదుట గుచ్చుకున్న వైనం
ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
అటు, మరో సీనియర్ నటి శిల్పాశెట్టి కూడా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో గాయపడడం తెలిసిందే. స్టంట్ సీన్ చిత్రీకరణలో శిల్పాకు కాలు విరిగింది.