Nithin: మాట తప్పని హీరో నితిన్: 'మాచర్ల' డైరెక్టర్

  • ఎడిటర్ గా అనుభవమున్న రాజశేఖర్ రెడ్డి 
  • 'మాచర్ల నియోజక వర్గం'తో దర్శకుడిగా పరిచయం
  • నితిన్ చేసిన హెల్ప్ మరువలేనిదంటూ వ్యాఖ్య
  • ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా   
Macharla Niyojakavargam movie update

నితిన్ .. కేథరిన్  .. కృతి శెట్టి .. ప్రధాన పాత్రధారులుగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. ఈ నెల 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా దిగిపోనుంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎడిటర్ గా మంచి అనుభవం ఉన్న రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.

నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను .. ఎన్నో కష్టాలుపడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చాను. 'లై' సినిమా షూటింగు సమయంలో నితిన్ గారిని కలిశాను. మంచి కథ రెడీ చేసుకునివస్తే నాకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని అన్నాడు. దాంతో ఈ కథను తయారు చేసుకుని ఆయనకి వినిపించాను" అన్నారు. 

"కథ విన్న వెంటనే ఎంతమాత్రం నాన్చకుండా నితిన్ ఓకే చెప్పాడు. ఇచ్చిన మాట తప్పకుండా నాకు అవకాశం ఇవ్వడం ఆయన మంచితనానికి నిదర్శనం. తనవారికి సాయపడటానికి ఎంతమాత్రం వెనుకాడని ఒక స్నేహితుడు ఈ సినిమాతో నాకు లభించాడు. స్నేహితుల దినోత్సవం రోజున ఈ సినిమా ఫంక్షన్ జరగడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News