కోలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం... వివరాలు ఇవిగో!
- నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లే టార్గెట్
- పలువురి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు
- 40 చోట్ల తనిఖీలు
- రూ.200 కోట్ల మేర లెక్కలు చూపని ఆదాయం
మొత్తమ్మీద రూ.200 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ఈ అప్రకటిత ఆదాయానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నట్టు బోర్డు వివరించింది. సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్మాతలు తక్కువగా చూపించారని, ఇక థియేటర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఆ ఆదాయానికి లెక్కలు చూపలేదని వెల్లడించింది. ఈ మేరకు ఐటీ దాడుల్లో ఆధారాలు బయటపడ్డాయని తెలిపింది.