ఆ గ్రామ జనాభా 800.. ఆరు నెలల్లో 60 మంది మృతి
- ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మిస్టరీగా మారిన మరణాలు
- రెగడగట్ట గ్రామంలోకి వైద్య బృందాలు
- పరీక్షల కోసం బాధితుల రక్త నమూనాలు
కానీ, ఈ మరణాలకు కారణం ఏంటన్నది తెలియడం లేదు. ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలోనే ఈ గ్రామం ఉంది. గ్రామస్థుల్లోని కాళ్లలో, ఇతర అవయవాల్లో వాపు కనిపిస్తోంది. దీంతో అధికారులు బాధితుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించే చర్యలు చేపట్టారు. అలాగే, నీరు, భూసార పరీక్షలు కూడా చేస్తున్నారు. ఈ మరణాలకు కిడ్నీ సమస్యలు కారణమేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.