కల్యాణ్ రామ్ 'బింబిసార' కు ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూస్..
- ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'
- విజువల్ వండర్ అంటూ ట్విట్టర్ రివ్యూలు
- కల్యాణ్ రామ్ యాక్టింగ్ అదిరిందంటున్న ప్రేక్షకులు
సోషల్ ఫాంటసీ మూవీ 'బింబిసార'కు తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. సినిమా అదిరింది అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటన ఒక రేంజ్ లో ఉందని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక విజువల్ వండర్ అని అంటున్నారు.