అంజలి ఐటమ్ అస్సలు ఆగేలా లేదే!
- పొలిటికల్ డ్రామాగా 'మాచర్ల నియోజకవర్గం'
- నితిన్ సరసన ఇద్దరు నాయికలు
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఈ నెల 12వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
ఇటీవల ఈ సినిమా నుంచి అంజలి - నితిన్ పై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ను వదిలారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సాంగ్, యూ ట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా యాప్స్ లో కలుపుకుని 500 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
పొలిటికల్ డ్రామాతో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.