జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న రైతుకు దొరికిన వజ్రం.. రూ. 25 లక్షలకు వ్యాపారి కొనుగోలు
- రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన రైతు
- బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షలకు పైమాటే
- జొన్నగిరి భూమిలో విలువైన వజ్రాలు
తాజాగా, పొలంలో పనిచేసుకుంటున్న జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం అతడిని లక్షాధికారిగా మార్చింది. నిన్న ఉదయం పొలంపని చేసుకుంటున్న రైతు చేతికి ఓ వజ్రం చిక్కింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.