మునుగోడు ఉప ఎన్నిక కమిటీని ప్రకటించిన కాంగ్రెస్
- కమిటీకి మధు యాష్కీ గౌడ్ నేతృత్వం
- సభ్యులుగా దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్, సంపత్
- కమిటీకి మునుగోడు ఉప ఎన్నికల వ్యూహం, ప్రచారం బాధ్యతలు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్ట్రాటజీ, ప్రచార కమిటీకి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, అనిల్, సంపత్‌లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ కమిటీనే అన్ని నిర్ణయాలను తీసుకోనున్నట్లు సమాచారం.