ఆస్ట్రాల్ పైపుల యాడ్ లో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్కు
- ఇటీవల యాడ్ షూటింగ్ లతో బన్నీ బిజీ
- కొన్నిరోజుల కిందటే త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్
- తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మరో యాడ్
- ఆస్ట్రాల్ పైపుల కోసం వాణిజ్యప్రకటన
- రఫ్ లుక్ తో కనిపిస్తున్న బన్నీ
తాజాగా ఈ యాడ్ కు సంబంధించి తన లుక్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, నోటిలో సిగార్ తో రఫ్ లుక్ ఉట్టిపడేలా బన్నీ దర్శనమిస్తున్నాడు. ఈ ఫొటోను బన్నీ పంచుకున్న కాసేపట్లోనే అభిమానులు లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.