అర్పిత ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో ఈడీ సోదాలు.. రూ. 29 కోట్ల నగదు, 5 కేజీల బంగారం స్వాధీనం
- స్కూల్ జాబ్స్ కుంభకోణంలో ఆరోపణలు
- మొదటి ఫ్లాట్‌లో రూ. 21 కోట్లు పట్టుబడిన వైనం
- తాజాగా రెండో ఫ్లాట్‌పైనా అధికారుల దాడులు
అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన ఇంట్లో దొరికిన సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దానిని తరలించాలని అనుకున్నామని పేర్కొన్నారు. అయితే, అప్పటికే ఈడీ అధికారులు దాడి చేయడంతో దొరికిపోయారు.