మధ్యాహ్నానికే ముగిసిన సోనియా ఈడీ విచారణ...మొత్తంగా 12 గంటల పాటు సాగిన విచారణ
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియా
- మూడు రోజుల పాటు సోనియాను విచారించిన ఈడీ
- ఇదే కేసులో రాహుల్ గాంధీనీ విచారించిన ఈడీ
ఈ నెల 21న తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీని మంగళవారం కూడా విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమెను అధికారులు ఏకంగా 6 గంటల పాటు విచారించారు. ఈ నెల 21న 3 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఇలా మొత్తంగా మూడు రోజుల పాటు ఆమెను 12 గంటల పాటు అధికారులు విచారించారు. బుధవారంతోనే సోనియా విచారణను ఈడీ అధికారులు ముగిస్తారా? లేదంటే మళ్లీ ఆమెను విచారణకు పిలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.