కేటీఆర్ పుట్టినరోజుకు తలసాని సాయికిరణ్ భారీ ప్లాన్... 116 ఆలయాల్లో అర్చనలు, త్రీడీ గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్
- జులై 24న కేటీఆర్ బర్త్ డే
- కార్యాచరణ రూపొందించిన మంత్రి తలసాని తనయుడు
- కేటీఆర్ పై డాక్యుమెంటరీ రూపకల్పన
కేటీఆర్ పేరుమీద 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని, త్రీడీ గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్, కేటీఆర్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తామని వెల్లడించారు. ద లీడర్ ఫ్రం ద లోకల్ టు గ్లోబల్ పేరిట ఈ డాక్యుమెంటరీ ఉంటుందని వివరించారు. కేటీఆర్ ప్రస్థానం యావత్తు ఈ డాక్యుమెంటరీ చిత్రంలో చూడొచ్చని పేర్కొన్నారు. ఇక కేక్ లో కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గం చెరువులను త్రీడీ గ్రాఫిక్స్ తో చూడొచ్చని తలసాని సాయికిరణ్ అన్నారు.