నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన టీడీపీ ఎంపీలు
- భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
- యశ్వంత్ సిన్హాపై ఘనవిజయం
- ముర్ముకు అభినందనలు తెలిపిన టీడీపీ ఎంపీలు
తాజాగా, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ద్రౌపది ముర్మును కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సహచర ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లతో కలిసి వెళ్లి భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలిపారు.