సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు!
- 12వ తరగతిలో 92.71 శాతం ఉత్తీర్ణత
- టర్మ్ 1, టర్మ్ 2 వెయిటేజ్ మార్కుల ఆధారంగా స్కోర్ కార్డులు
- ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు జరిగిన టర్మ్ 2 పరీక్షలు
టర్మ్ 1, టర్మ్ 2 వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఫైనల్ మార్క్ షీట్లను సీబీఎస్ఈ తయారుచేసింది. విద్యా సంవత్సరంలో సాధించిన ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రీబోర్డ్ ఎగ్జామ్స్ మార్కులు స్కోర్ కార్డులో ఉంటాయి. ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు టర్మ్ 2 పరీక్షలు జరిగాయి. టర్మ్ 1 పరీక్షలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.
