'పుష్ప 2' కోసం రంగంలోకి మనోజ్ బాజ్ పాయ్!
- 'పుష్ప2' కోసం జరుగుతున్న సన్నాహాలు
- మరింత భారీతనం కోసం జరుగుతున్న కసరత్తు
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఎక్కువ సంఖ్యలో కనిపించనున్న బాలీవుడ్ తారలు
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ - మనోజ్ బాజ్ పాయ్ కలిసి 'హ్యాపీ' సినిమాలో చేశారు.
ఆ సినిమాలో కూడా మనోజ్ బాజ్ పాయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రనే పోషించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. మళ్లీ ఇంతకాలానికి బన్నీ సినిమాలో ఆయన చేయనున్నాడనీ .. అదీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడం విశేషమని అంటున్నారు. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా షూటింగు మొదలుకానుంది.