America: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకి.. ఇండియానా మాల్‌లో ముగ్గురిని కాల్చి చంపిన దుండగుడు

  • గ్రీన్‌వుడ్ పార్క్‌ మాల్‌లో ఘటన
  • హంతకుడిని కాల్చి చంపిన పౌరుడు
  • గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Gunman kills 3 at Indiana mall before civilian shoots him dead

అమెరికాలో తుపాకి మళ్లీ పేలింది. ఇండియానా రాష్ట్రంలోని ఓ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఓ పౌరుడు తన వద్దనున్న తుపాకితో హంతకుడిని కాల్చి చంపాడు. గ్రీన్‌వుడ్ పార్క్ మాల్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. 

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గ్రీన్‌వుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు కారణం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షూటర్ వద్ద పొడవైన తుపాకి, పలు మ్యాగజైన్లు కనుగొన్నట్టు చెప్పారు.

More Telugu News