NASA: అంగారకుడిపై నూడుల్ లాంటి పదార్థం.. ఫొటో విడుదల చేసిన నాసా

  • ఎండిపోయిన చిన్న గడ్డిమొక్కలా ఉన్న పదార్థం
  • కచ్చితంగా అది ఏంటన్న విషయాన్ని నిర్ధారించలేకపోతున్న శాస్త్రవేత్తలు
  • కెమెరాలో బంధించిన నాసా పెర్సవరెన్స్ రోవర్
NASAs Perseverance rover spots noodle like object on Mars

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) విడుదల చేసిన ఓ ఫొటో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉంది. నాసా రోవర్ ఈ ఫొటోను చిత్రీకరించింది. దాని ముందువైపున్న కెమెరాలు ఈ పదార్థాన్ని తమ కెమెరాలో బంధించాయి. అయితే, ఈ పదార్థం ఏంటన్న విషయంలో శాస్త్రవేత్తలు కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. చూడ్డానికి మాత్రం ఎండిపోయిన ఓ చిన్న గడ్డిమొక్కలా ఉంది. అయితే, చాలా మంది నిపుణులు మాత్రం ఇది గతంలో నాసా పంపిన మిషన్ కు చెందిన శకలమై ఉంటుందని భావిస్తున్నారు.

గత నెలలో  కూడా రోవర్ పంపిన ఓ ఫొటో ఆసక్తిని రేకెత్తించింది. మార్స్‌‌పైన జెజోరో క్రేటర్ వద్ద మెరిసే పదార్థం ఫొటో తీసి పంపింది. అయితే, దానిని మార్స్ రోవర్ నుంచి విడిపోయిన వ్యర్థ పదార్థంగా తర్వాత గుర్తించారు. కాగా, అంగారకుడిపై నాసా పంపిన పెర్సవరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరితో ఏడాది పూర్తి చేసుకుంది. మార్స్‌పై దాని అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.

More Telugu News