తెలంగాణలో తాజాగా 459 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 22,193 కరోనా పరీక్షలు
- మరోసారి 400కి పైచిలుకు కొత్త కేసులు
- హైదరాబాదులో 323 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 468 మంది
- ఇంకా 5,180 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,124 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,96,833 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,180 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
