తెలంగాణలో మరో 608 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 28,055 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 329 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 459 మంది
- ఇంకా 5,146 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,05,137 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,95,880 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,146 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
