త్వరగా కోలుకో నాన్నా: లాలూ ప్రసాద్ యాదవ్ కూతురి భావోద్వేగం
- మెట్లపై నుంచి జారి పడ్డ లాలూ ప్రసాద్ యాదవ్
- పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం
- నువ్వే నా హీరో అంటూ కూతురి భావోద్వేగం
మరోవైపు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... 'నాన్నే నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్నా. ఎన్నో అవరోధాలను జయించారు. కోట్లాది మంది ప్రార్థనలే ఆయన శక్తి' అని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో లాలూ చికిత్స పొందుతున్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. రోహిణీ ఆచార్య సింగపూర్ లో ఉంటున్నారు.
మరోవైపు ఈరోజు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. అయితే, తమ అధినేత లాలూ ఆసుపత్రిలో ఉండటంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఇంకోవైపు, తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కు లాలూ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
