తెలంగాణ సహా దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్.. కనుగొన్న ఇజ్రాయెల్ శాస్త్రవేత్త

New corona variant found in India
షార్ట్స్‌లో చూడండి
భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన సరికొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ తెలిపారు. దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీఏ.2.75 (BA.2.75) సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీఫ్లాన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు ఇండియా (పది రాష్ట్రాల నుంచి) అలాగే, ఏడు ఇతర దేశాల నుంచి 85 స్వీక్వెన్స్‌లు అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు. అయితే, ఇండియా వెలుపల స్వీక్వెన్స్‌ల నుంచి ఎలాంటి ట్రాన్స్‌మిషన్‌ను ట్రాక్ చేయలేదని అన్నారు. 

జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండు కలిసి మొత్తం 69 కేసుల్లో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్ తెలిపారు. ఇది రాబోయే ట్రెండ్‌ను సూచిస్తోందని, ఈ వేరియంట్ ఆందోనకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
Go Back to Shorts
BA.2.75
Sub Variant
Corona Virus
India
Telangana
Dr Shay Fleishon
Israel

More Telugu News