తెలంగాణలో కొత్తగా 457 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు
- హైదరాబాదులో 285 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 494 మంది
- ఇంకా 4,747 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,02,379 మంది కరోనా బారినపడగా, వారిలో 7,93,521 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.
